జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా మున్సి” పోల్స్”

మధ్యాహ్నం 1గంటకు 47.8 శాతం ఓటింగ్ నమోదు!
కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల వెల్లడి
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జరుగుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల వెల్లడించారు.

పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ నిఘా, ఓటర్ల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ వసతులపై క్షేత్రస్థాయి సమీక్ష చేశారు.వయోవృద్ధులు,దివ్యంగులు మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాధాన్యతా క్యూ లైన్లు, ఉచిత తాగునీటి సదుపాయం కల్పన…ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఓటు వేయడానికి వచ్చిన వారితో ఆప్యాయంగా పలకరింపు .ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు 47.8% నమోదైనట్లు తెలిపారు. చిలకలూరిపేట లో 45.5 శాతం, వినుకొండ లో 47.28 శాతం, మాచర్ల లో 48.54 శాతం, సత్తెనపల్లి లో 51.91 శాతం నమోదైనట్లు వివరించారు.