మున్సిపల్ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పలుచోట్ల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఓటు హక్కు ను వినియోగించుకున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి

ఎమ్మిగనూరులో ఓటు హక్కు వినియోగించున్న మాజీ ఎంపీ బుట్ట రేణుక దంపతులు

ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌చార్జి రాజీవ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. అనంతరం అరెస్టు చేసి గృహ నిర్బంధించారు.
