Mumbai : న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) ఇవాళ న‌ష్టాల్లో (losses) ప్రారంభ‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లోని సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ మన సూచీలు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా ఇందుకు కారణమైంది.


ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ (Sensex) 180 పాయింట్ల నష్టంతో 82,552 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (Nifty) 28 పాయింట్లు క్షీణించి 25,191 వద్ద ఉంది. డాలర్ (Dollar) తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.33 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎటర్నర్, జేఎస్ డబ్ల్యూ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హీరో మోటార్ కార్ప్, ట్రెంట్, కొటక్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచనాలు మించి రూ.6921కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024-25 కాలానికి వచ్చిన లాభం రూ.6368కోట్లతో పోలిస్తే ఇది 8.6శాతం ఎక్కువ.

Leave a Reply