ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
చిన్నంబావి, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని పెద్దమారూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షుడు కేతపాగ గోపాల్, ప్రధాన కార్యదర్శి శివకృష్ణ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే గ్రామస్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హక్కుల సాధన కోసం ఢిల్లీ కేంద్రంగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటానికి గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నూతన కమిటీ ఎన్నికలో అధ్యక్షుడిగా మొలకలపల్లి శివ, అధికార ప్రతినిధిగా సులిగిరి చిరంజీవి, ఉపాధ్యక్షులుగా పగిడాల రాముడు, ప్రధాన కార్యదర్శిగా దేవరపోగు నరేష్, కోశాధికారిగా కేతపాగ రవి, కార్యదర్శిగా కిరణ్, సహాయ కార్యదర్శులుగా కేతపాగ స్వాములయ్య, చిన్న కురుమయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
