Motkur | కౌన్సిలర్ రేసులో సీనియర్ సిటిజన్లు..!

Motkur | మోత్కూర్ , ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా ముగ్గురు సీనియర్ సిటిజన్లు బరిలో నిలిచారు. 1 వ వార్డులో రిటైర్డ్ ప్రదానోపాధ్యాయులు, సామాజిక సేవకుడు మోత్కూర్ బ్రహ్మచారి (68 ) బీజేపీ అభ్యర్థిగా, 2వ వార్డు లో మర్రి మరియమ్మ( 74) బీఆర్ఎస్ అభ్యర్థిగా, 4వ వార్డులో దొంతర పోయిన భారతమ్మ (78 ) స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఏడుపదుల వయసులోనూ… ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో బలులోకి దిగినట్లు తెలిపారు. ఆయా వార్డులలో తమ మద్దతుదారులతో పార్టీ కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
