Motkur | ఘనంగా సంక్రాంతి వేడుకలు

Motkur | మోత్కూర్, ఆంధ్రప్రభ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజాభారతి, రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త నిర్వహణలో మంగళవారం స్థానిక మినీ స్టేడియం ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీలలో పాల్గొన్నారు.

పోటీల విజేతలకు ఈ రోజే పల్లెర్ల వెంకన్న, కల్యాణి, అల్లాడి సోమేశ్వర్ దాతల సహకారంతో నగదు బహుమతులతో పాటు, షీల్డ్ లు, ప్రోత్సాహక బహుమతులుగా చీరలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు బోల్ల హన్మంత్, ఓ సత్యనాధ్ లు తెలిపారు.
