Mothkur | కౌన్సిలర్ల కోసం ఎదురుచూపు..

Mothkur | కౌన్సిలర్ల కోసం ఎదురుచూపు..

  • చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు ఏర్పాటు సిద్ధం..

Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల రాకకై ఎదురు చూస్తున్నారు. ఎన్నికకు సంబంధించి సమావేశ మందిరంలో ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ లు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. రామన్నపేట, మోత్కూర్ సిఐ లు వెంకటేశ్వర్లుల ఆధ్వర్యంలో సుమారు 40 మంది తో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బారీకేడ్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్యాలయం ఆవరణలో 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు, నాయకులు సహకరించాలని సిఐ లు కోరారు.

Leave a Reply