నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మానవత్వాలు మంట కలిసి పోతున్నాయి. అభిమానాలు ప్రేమలు ఆప్యాయతలు కరువైపోతున్నాయి. ప్రపంచమంతా పైసల చుట్టూ నడుస్తుంది.. ఆస్తి తగాదాల విషయంలో కన్న కొడుకుని కడతేర్చిన సంఘటన నంద్యాల జిల్లా (Nandyal District) లో సోమవారం జరిగిన సంఘటన సంచలనం కలిగించింది.
వెలుగోడు మండలం (Velugodu Mandal) మోత్కూరు గ్రామం (Motkur village)లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుధాకర్ మద్యానికి బానిసయ్యాడు. తండ్రి గతంలోనే మరణించాడు. ఆస్తి తగాదా (property dispute)ల విషయంలో తల్లి శివమ్మతో ప్రతీరోజు గొడవపడేవాడు. ఆస్తుల విలువ పెరగటంతో తాగుడుకు బానిసైన సుధాకర్.. తన ఆస్తి విషయంపై గొడవపడేవాడు. సుధాకర్ ప్రవర్తనతో విసుగు చెందిన తల్లి కన్న కొడుకును హతమార్చింది. ఈ హత్య కేసులో కొందరు కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. తల్లి శివమ్మను తదితరులను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

