ముషీరాబాద్‌లో అత్యధిక వర్షపాతం

ముషీరాబాద్‌లో అత్యధిక వర్షపాతం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తాజా నివేదిక ప్రకారం, ముషీరాబాద్ మండలంలోని బౌధా నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద అత్యధికంగా 31.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక స్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద 30.5 మి.మీ, అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట వద్ద 29.8 మి.మీ, సారూర్‌నగర్ ఆల్కాపురి కమ్యూనిటీ హాల్ వద్ద 29.5 మి.మీ వర్షపాతం నమోదై నట్లు అధికారులు తెలిపారు.

వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి (మి. మీ లలో)

బౌద్ధ నగర్, ముషీరాబాద్ 31.0
ఓయూ రిజిస్ట్రార్ ఆఫీస్ 30.5
బతుకమ్మకుంట (అంబర్‌పేట్) 29.8
ఆల్కాపురి (సరూర్‌నగర్) 29.5
పికెట్ హెల్త్ సెంటర్ 29.0
మలక్‌పేట్ మిల్లత్ హాల్ 29.0
భోలాక్పూర్ కమ్యూనిటీ హాల్ 28.8
స‌నత్‌నగర్ గోవ్ట్ బాయ్స్ స్కూల్ 27.3

వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. ముషీరాబాద్, అంబర్‌పేట్, చార్మినార్, సనత్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఫీల్డ్‌లోకి దిగి డ్రైనేజ్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీస్‌లు కూడా వర్షం వల్ల ఏర్పడిన జామ్‌లను తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రానున్న గంటల్లో కూడా నగరం లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో వర్షం తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply