Monsoon | తొలి రోజే లోక్ సభలో రచ్చ రచ్చ… ప్రారంభమైన వెంటనే వాయిదా

న్యూ ఢిల్లీ ‍ ‍ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభమైయ్యాయి. తొలి రోజే లోక్ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే, వాయిదా తీర్మానాలపై చర్చించాలని కోరారు. దానికి స్పీకర్ ఒప్పకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు లోక్ సభలో నిరసన వ్యక్తం చేశాయి. విపక్షాల నిరసనతో ప్రశ్నోత్తరాల తర్వాత ఆపరేషన్ సిందూర్పై చర్చిద్దామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే నోటీస్ ఇవ్వాలని సూచించారు. అన్ని అంశాలపై చర్చిద్దాం.. ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుందని ఓం బిర్లా చెప్పారు. అయినా కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

Leave a Reply