పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (south central railway General Manager) సందీప్ మాతూర్ తెలియజేశారు. సోమవారం పెద్దపల్లి (Peddapally) జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో అమృత్ స్కీం లో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు.
వేగవంతంగా పనులను పూర్తి చేయాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీం (Amrit Scheme) లో భాగంగా తెలంగాణలోని అనేక రైల్వే స్టేషన్ ల ఆధునికరణ కోసం నిధులను కేటాయిచ్చిందన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికంగా జరుగుతున్నాయని, నాణ్యత లోపం లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు.