మోడల్ పార్లమెంట్ పోస్టర్ విడుదల
- యువతకు పార్లమెంట్ చర్చల్లో పాల్గొనే అవకాశం!
- ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026–27’ పోస్టర్ విడుదల
- ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంశంపై చర్చా కార్యక్రమం
- 18 నుంచి 25 ఏళ్ల యువతకు అవకాశం.. మూడు నిమిషాల ప్రసంగ సమయం
కోదాడ అర్బన్, నవంబర్ 3 (ఆంధ్రప్రభ): యువతలో ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థలపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026–27’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. మై భారత్ కేంద్రం సూర్యాపేట జిల్లా నిర్వాహకుల ఆధ్వర్యంలో నవంబర్ 4న సూర్యాపేటలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి కార్యక్రమం జరగనుంది.
కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, మై భారత్ కేంద్రం జిల్లా ఇన్‌చార్జి దిగూటి భవాని నేతృత్వంలో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రణబోతు పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న విద్యార్థులు, యువత ఈ మోడల్ యూత్ పార్లమెంట్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.
‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడేందుకు మూడు నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి. యాదగిరి, వి. బలభీమరావు, ఆర్. రమేష్, పి. రాజేష్, బి. రమేష్‌బాబు, కె. రామరాజు, ఆర్. రవికిరణ్, కె. సతీష్, ఎస్. గోపికృష్ణ, ఎస్.కె. ముస్తఫా, జె. తిరుపతయ్య, ఎస్.కె. ఆరిఫ్, ఈ. నరసింహారెడ్డి, కె. శాంతయ్య, ఎన్. జ్యోతిలక్ష్మి, ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటేశ్వరాచారి, టి. మమత, డి.ఎస్. రావు తదితరులు పాల్గొన్నారు.
