Model market | మోడల్ మార్కెట్ పనులు పరిశీలిల‌న‌..

Model market | మోడల్ మార్కెట్ పనులు పరిశీలిల‌న‌..

  • మోడల్ మార్కెట్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం…
  • జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్…

Model market | జనగామ, ఆంధ్రప్రభ : జనగామలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మోడల్ మార్కెట్(Model market)లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. ఈ రోజు జనగాం మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న మోడల్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ తుది పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మార్కెట్ భవన నిర్మాణ నాణ్యత, అంతర్గత వసతులు, షాపుల ఏర్పాటు, పారిశుధ్య సదుపాయాలు, తాగునీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ(drainage system), విద్యుత్ సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ. ప్రజలకు సౌకర్యవంతంగా వినియోగించేలా చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, మార్కెట్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

మోడల్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్(non-veg market) పట్టణ ప్రజలకు అవసరమైన కీలక సౌకర్యమని, శుభ్రత, పారిశుధ్యం , నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా తుది పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జనగాం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ శాఖ డిఇ, ఎఇ, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.

Leave a Reply