పునరావాస కేంద్రంలో ఎమ్మెల్యే సహాయక చర్యలు..
సత్తుపల్లి, (ఆంధ్రప్రభ) : వేశ్యకాంతల చెరువు పొంగిపొర్లడంతో ఆయకట్టులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అక్కడి కుటుంబాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాత్రి 1 గంటకు పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
