MLA | ఎమ్మెల్యే నిధులతో.. హైమాస్ట్ లైట్లు

MLA | ఎమ్మెల్యే నిధులతో.. హైమాస్ట్ లైట్లు
MLA | జైనూర్, ఆంధ్రప్రభ : అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి నిధులతో జైనూర్ కు 3 నూతన హైమాస్ట్ లైట్లు(Highmast lights) మంజూరు చేశారని జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ తెలిపారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు ఇవాళ జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడ్మత విశ్వనాథ్ రావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు, జైనూర్ మాజీ సహకార చైర్మన్ కోడప హన్ను పటేల్ లతో కలిసి పనులకు ప్రభుత్వ అసుపత్రి ప్రాంగణంలో భూమి పూజచేశారు.
కుమ్రం భీం చౌరస్తా వద్ద, హనుమందిరం, ప్రభుత్వ అసుపత్రి ప్రాంగణంలో మూడు చోట్ల, ప్రధామైన కూడళ్లలో ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవలక్ష్మి చొరవతో తన ఎమ్మెల్యే నిధులతో మండల కేంద్రంలో హైమాస్ట్ లైట్ల కోసం నిధులు మాంజూరు చేయడంతో స్థానిక సర్పంచ్ తో పాటు గ్రామపంచాయితీ ప్రజలు ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kovalakshmi)కి కృతజ్ఞతలు తెలిపారు.
కోడప ప్రకాష్ సర్పంచ్ గా విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే కృషితో మంజూరు చేయించడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు(public representatives) అభినంధనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఏస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల, జైనూర్ మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మడావి భీంరావు, మాజీ యంపిటిసి, భగవంతరావు, పవుర్ గూడ నూతన సర్పంచ్ తోడసం రాజేందర్, కాంగ్రెస్ నాయకులు మెస్రం అంబాజీ రావు, పంచాయితీ కార్యదర్శ అనంద్ రావు, అసుపత్రి డాక్టర్ ఆశోక్, కాంగ్రెస్ నాయకులు హజ్జు లాల, రహీం, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
