MLA | మృతుల కుటుంబాలకు పరామర్శ
MLA | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొప్పిడి మురళి, కోదురుపాక సత్తయ్య, నర్సాపూర్ గ్రామానికి చెందిన తోట్ల కొమురయ్యలు ఇటీవల అనారోగ్యంతో మరణించగా, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ(Kokkirala Surekha) ఇవాళ వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చింది. ఈకార్యక్రమంలో ఆర్ జి పి అర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, మాజీ జడ్పిటిసి గడ్డం నాగరాణి, రెబ్బెనపల్లి గ్రామ సర్పంచ్ కందుల కల్యాణి అశోక్, మండల నాయకులు ముత్యాల శ్రీనివాస్(Mutyala Srinivas), కంది సతీష్, బోయిడి వెంగల్ రావు, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు సిరికొండ నవీన్, ఆకుల దుర్గాప్రసాద్, గాండ్ల సత్యనారాయణ, గాజుల లక్ష్మి నారాయణగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండ రాకేష్, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

