మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఓసీ అందజేత

నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి చర్యలు

భవానిపురం, ఆంధ్రప్రభ: ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఎల్‌ఓసీలను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌, బీజేపీ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు, నగరాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బెవర సాయి సుధాకర్‌, టీడీపీ నాయకులు మైలవరపు దుర్గారావు భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీని అందజేశారు. 47వ డివిజన్‌ చిట్టినగర్‌కు చెందిన దేవు హేమంత్‌ కుమార్‌ (17) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మంజూరైన రూ.7 లక్షల 83 వేల విలువైన ఎల్‌ఓసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్‌ఓసీని మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుజనా మిత్రా సమన్వయకర్తలు పాల్గొన్నారు.