డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచన ..
ఎల్బీనగర్, జులై 23 (ఆంధ్రప్రభ) : రెండు రోజుల క్రితం వనస్థలిపురం డివిజన్ పరిధి ఆర్.టీ.సీ.కాలనీలో బోనాల పండుగ (Bonala festival) సందర్భంగా తీసుకొచ్చిన మాంసాహారం వంటకాలు తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 10మంది ఫుడ్ పాయిజన్ (Food poisoning) కి గురై చింతలకుంట (Chintalkunta) హిమాలయ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బాధితుల్లో ఒకరైన శ్రీనివాస్ మృతిచెందడం ఎంతో బాధాకరమని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బోనాల సందర్భంగా మాంసఆహారం తినడంతో, వాంతులు, విరోచనలు అధికంగా కావడం వల్ల అస్వస్థతకు గురై వారు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగా ఉండగా, మరో ఇద్దరి ఆరోగ్యం వచ్చే రెండు మూడు రోజుల్లో మెరుగవుతుందని చెప్పారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం బాధితులకు సాయం అందించాలని కోరారు. డీఎంహెచ్ఓ తో ఫోన్ లో మాట్లాడి, బాధితులకు తగిన న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.