MLA | నర్సాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

MLA | నర్సాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
MLA | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : రాబోయే ఐదేళ్లలోపు ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జూ సహకారంతో నర్సాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో(all fields) అభివృద్ధి చేస్తామని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డిఎస్ సంగీత రాజేష్ అన్నారు. కడం మండలం నర్సాపూర్ జీపీ గ్రామ సర్పంచ్ గా డిఎస్ సంగీత, ఉప సర్పంచ్ గా జంగం రమేష్, జీపీ వార్డు సభ్యులను ఎస్ఓ నిర్మల్ జడ్పీ సీఈఓ డి. శంకర్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా సీఈఓ శంకర్ మొదటగా సర్పంచ్ గా డిఎస్ సంగీత, ఉప సర్పంచ్ గా జంగం రమేష్, వార్డు సభ్యులు కుడిమెత లక్ష్మీబాయి, పెంద్రం తిరుపతి , నాయిని అశోక్, గుగులవత్ విజయ, మీసాల సాయవ్వ లను ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ డీఎస్ సంగీత, ఉప సర్పంచ్ జంగం రమేష్, వార్డు సభ్యులను గ్రామ పెద్దలు(village elders) పలు పార్టీల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు(public representatives), గ్రామస్తులు, యువకులు, అభిమానులు, స్థానిక పంచాయతీ సెక్రెటరీ కె నరేష్ శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన సంగీత మాట్లాడుతూ.. గ్రామ పెద్దల, ప్రజల, యువకులు, మహిళలు సహకారంతో గెలిపించినందుకు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు సహకారంతో నర్సాపూర్ జీపీకి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు.
