తండాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది..

తండాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది..
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని పద్మావతి గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనం గా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ముందుగా వారు సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆర్డీవో వెంకన్న అధ్యక్షతన జరి గిన సభలో ఎమ్మె ల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739లో అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రాంజీ నాయక్ తండాలో జన్మించారని తెలిపారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకు వచ్చిన మహనీయుడు సంత్ సేవా లాల్ అని కొనియాడారు. వివాహం చేసుకోకుండా సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేసి బంజారులకు మూడు నమ్మకాలపై అవగాహన కల్పిం చిన గొప్ప సంస్కర్త అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా ముందుగా జరుపుకో లేకపోయామని, ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

- ఒక్కో జీపీకి రూ.5 లక్షలు మంజూరు చేస్తాను :
నియోజకవర్గంలోని దాదాపు అన్ని తండాలను గ్రామపంచాయతీలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కడియం అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు, నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మోడల్ స్కూల్ పక్కన రూ.2 కోట్ల తో నిర్మిస్తున్న బంజారా భవనం 90 శాతం పూర్తయిందని, ఇకపై బంజా రా కార్యక్రమాలన్నీ అక్కడే నిర్వహించుకోవచ్చన్నారు. నియోజకవర్గం లో ఉన్న 27 గ్రామపంచాయతీలకు 15 రోజుల్లోగా ఒక్కో జీపీకి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఎక్కడ జీపీ భవనాలు లేవో అక్కడ సర్పంచ్‌లు లేఖ ఇస్తే వెంటనే మంజూరు చేస్తానన్నారు. ప్రతి తండాకు బీటీ రోడ్లు అందించేందుకు కృషి చేస్తాను. ఎక్కడ రోడ్డు లేకపోతే నేరుగా తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే లేదా ఓహెచ్‌ఆర్ సరిపోకపోతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఏప్రిల్‌లో రెండో దశలో జనాభా ఆధారంగా సర్పంచ్‌లను పిలిచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడిం చారు. త్వరలో 27 మంది సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
సర్పంచ్‌లు బెల్ట్ షాపులు నడిపితే రద్దు చేయిస్తా:
తండాల్లో మద్యం అలవాటు మానుకోవాలని ఎమ్మెల్యే కడియం పిలుపునిచ్చారు. సర్పంచ్‌లు బెల్ట్ షాపులు నడిపితే రద్దు చేయిస్తానని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రతి తండాలో పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలి. అది సర్పంచ్‌ల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యా ప్తంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించడం బంజారా సమాజానికి గౌరవమని పేర్కొన్నారు.
-బంజారుల ఆరాధ్య ధైవం సేవాలాల్ మహారాజ్ : ఎంపీ కావ్య
బంజారుల ఆరాధ్య ధైవం సేవాలాల్ మహారాజ్ అని ఎంపీ కడియం కావ్య అన్నారు. తన జీవితం బంజారా సమాజ అభివృద్ధికే అంకి తమని తెలిపారు. సంత్ సేవాలాల్ అడుగుజాడల్లో నడుస్తూ విద్య, వైద్యం, పరిశుభ్రత రంగాల్లో గ్రామపంచాయతీల్లో మార్పు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు తనను, తన తండ్రిని ఆశీర్వదించి గెలిపించారని, ఆ నమ్మకానికి తగిన విధంగా సేవ చేస్తానన్నారు. కష్టపడి పనిచేస్తే దేవుడు అన్నీ ఇస్తాడని వ్యాఖ్యానించారు. ఈ కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారజోడు రాంబాబు, మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వినయ్, నాయకులు రాజేష్ నాయక్, స్వామి నాయక్, ప్రజాప్రతినిధు లు, తదితరులు పాల్గొన్నారు.
