తెలంగాణలో రజాకార్ల పాలన..

తెలంగాణలో రజాకార్ల పాలన..

కెసిఆర్ కు పట్టిన గతే రేవంత్ ఉద్దీన్ కు పట్టడం ఖాయం
కామారెడ్డి జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది
రేవంత్ సర్కార్ కి ప్రజలే గుణ పాఠం చెబుతారు
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
బాన్సువాడకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నపోలీసులు

నిజామాబాద్, ఆంధ్రప్రభ: గతంలో సీఎం కేసీఆర్ హిందువులను అవమానిం చే విధంగా హిందుగాళ్లు బొందు గాళ్లు అంటే తెలంగాణ ప్రజలు ఆయనను బొంద పెట్టారని ఆయనకు పట్టిన గతే ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ కు పట్టడం ఖాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న అర్బన్ ఎమ్మెల్యే ని గాంధారి క్రాస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవి దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభు త్వ హయాంలో హిందూ ఆలయాలపై, దేవతలపై, హిందూ మహిళలపై దాడులు జరగడం అరాచకమని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పరాకాష్ట అని విమర్శించారు. మన మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే పై దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి ఘటన, ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయం పై దాడి ఘటన చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై విసిగిపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

రేవంత్ రెడ్డి గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పడమే కాకుండా తనను రేవంత్ ఉద్దీన్ అని పలకమని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకపై ఇలానే హిందూ దేవతలపై హిందూ ఆలయాలపై, హిందూ ప్రజలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ సర్కార్ కి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a Reply