పల్లెసీమల సమగ్ర వికాసమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి

పల్లెసీమల సమగ్ర వికాసమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి

స్వర్ణ పంచాయతీ, మూడు సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే భూమిపూజ
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

చల్లపల్లి, ఆంధ్రప్రభ : పల్లెసీమల సమగ్ర వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం చల్లపల్లి ప్రధాన కూడలిలో రూ.40లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.72 లక్షలతో రజక బజారు, నారాయణరావు నగర్ కాలనీల్లో రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శిలా ఫలకాలు ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ నిధులతో అశోక్ నగర్, నారాయణరావు నగర్ కాలనీల్లో నిర్మించిన మూడు సీసీ రోడ్లను ప్రారంభించారు. సీసీ రోడ్ల ప్రారంభం సందర్భంగా నివాసితులు ఎమ్మెల్యేను సత్కరించారు.

ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ పంచాయతీ వద్ధ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో రూ.31.65 కోట్ల ద్వారా 462 సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా చల్లపల్లి గ్రామంలో రూ.కోటీ ఏడు లక్షల 50వేలతో 18 సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో సాస్కి నిధులు రూ.14.57 కోట్లతో ఆరు బీటీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగానికి ప్రాముఖ్యత ఇస్తూ రూ.5.04 కోట్లతో 14 నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు నిర్మించటంతో పాటు, అసంపూర్తిగా ఉన్న 15 ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసేందుకు రూ.1.36 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వీటితో పాటు చల్లపల్లిలో గ్రామ పంచాయతీ నిధులు రూ.3.38 కోట్లతో 118 జీఎస్బీ రోడ్లు, 34 సీసీ రోడ్లు, 14 డ్రైనేజీలు నిర్మించటం అభినందనీయం అన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుముడి సాయిబాబు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, గ్రామ ప్రముఖులు సజ్జా చలపతిరావు, టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, ఎంపీపీ కోట విజయ రాధిక, స్వచ్ఛ ఏపీ డైరెక్టర్ బోలెం నాగమణి, మంగళాపురం సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్, ఎంపీటీసీ మాలెంపాటి శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, టీ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి చంద్రశేఖర్ (చిట్టి), ఎంపీడీఓ ఏఏ ఆనంద కుమారి, డిప్యూటీ ఎంపీడీఓ బాలాజీ, కో-ఆప్షన్ సభ్యులు షేక్ నబీఘోరీ, పీఆర్ ఏఈ బొప్పన శ్రీనివాసరావు, పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, వైద్యాధికారి డాక్టర్ శివరామకృష్ణ, వార్డు సభ్యులు అంబటి భువనేశ్వర్, షేక్ సిలార్, ఏఎంసీ డైరెక్టర్ సూదాని నందగోపాల్, కూటమి నాయకులు అనుమకొండ పూర్ణచంద్రరావు, బుల్లా కిషోర్, రాయవరపు నాంచారయ్య, మిరియాల జితేంద్ర, రావి రాజు, మేడికొండ రవి, మట్టా చిన్నా, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply