పరామర్శించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

బాలానగర్, అక్టోబర్ 6 ఆంధ్రప్రభ: బాలానగర్ మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన గుడి పూజారి హరిబాలనందదాసు, మల్లారెడ్డి ఇటీవల హెర్నియా ఆపరేషన్‌ చేయించుకున్న విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పూజారి, మల్లారెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని, వైద్యులు సూచించిన చికిత్స, మందులు సక్రమంగా తీసుకుంటున్నారా అని ఆరా తీశారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.