MLA | ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభిచాలి

MLA | ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభిచాలి

  • సీఎం విజన్ తో విద్యాభివృద్ధి
  • అసెంబ్లీలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

MLA | నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : సీఎం రేవంత్ రెడ్డి విజన్ తో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పురోగమిస్తుందని, అందులో భాగంగా
యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు.

యంగ్ ఇండియా స్కూళ్లతో పేద విద్యార్థులకు ఎంతో మంచి నాణ్యమైన చదువు అందుతుందని అసెంబ్లీలో తాను మాట్లిడినట్లు ఆంధ్రప్రభతో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని కులాలు, వర్గాల ప్రజలు ఒకేచోట యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఈ స్కూల్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను చిన్నప్పుడు చదివిన పబ్లిక్ స్కూల్ కంటే ఈ స్కూల్ డిజైన్ చాలా బాగుందన్నారు. రాష్ట్రంలోని గురుకులాలకు గ్రీన్ బోర్డులు, బెంచీలు ఫర్నీచర్ కేటాయించాలన్నారు. జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, త్వరలో శంకుస్థాపన చేపడతామన్నారు.

Leave a Reply