MLA | కడియం ఆశీర్వాదం….

MLA | కడియం ఆశీర్వాదం….

  • వినయ్ కుమారుకు హత్తుకుని అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
  • ఎన్నిక అనంతరం భావోద్వేగ క్షణాలు
  • సభా ప్రాంగణంలో ఆనందోత్సాహాలు

MLA | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) ప్రమాణ స్వీకారం అనంతరం సభా ప్రాంగణంలో భావో ద్వేగ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే సభామందిరం వెలుపలికి వచ్చిన వినయ్ కుమార్ నేరుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వద్దకు వెళ్లారు. అక్కడే ఎమ్మెల్యే పాదాలకు నమస్కా రం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయనను హత్తుకుని అభినందనలు తెలియజేశారు.

ఈ క్షణం అక్క డున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఆకట్టుకుంది. కొద్ది సేపు సభా ప్రాంగణంలో చప్పట్లు, నినాదాలు మార్మోగాయి. నూతన చైర్మన్‌ కు పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, అభిమాను లు ఆయనతో చేతులు కలిపి అభినందనలు తెలియజేశారు. కాంగ్రె స్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ..తనపై నమ్మకం ఉంచిన నాయకత్వానికి, ప్రజ లకు కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సూచనలతో ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply