కూటమి మహాధర్నాకు బ‌యలుదేరిన మంత్రి సీతక్క

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
ములుగు,ఆంధ్రప్రభ :
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ‘ఇండియా’ కూటమి డిమాండ్ చేస్తోంది.

ఇండియా కూటమి పిలుపు మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మహాధర్నాలో పాల్గొనేందుకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ , యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ లతో పాటుగా, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హస్తినకు బయలుదేరారు..