ఎమ్మెల్యే కొణతాల కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేష్

భోగాపురం, ఆంధ్రప్రభ : అనకాపల్లి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన ఈ వేడుకలో లోకేష్ నూతన వధూవరులు లక్ష్మీ రమ్య–అనంత్ బాబులకు ఆశీర్వాదాలు అందించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply