రాములబండ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ మండలం రాములబండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఆయన స్వయంగా స్వామివారి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తుల ఐక్యతే దేవాలయ ఉత్సవాల విజయానికి బలం అన్నారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ సీతారామచంద్రస్వామిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. అనంతరం ఆయన రాములబండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య,సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్,ప్రకాష్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
