మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి రవీంద్ర
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు..
ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మంత్రి రవీంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
మంత్రి వెంట మోపిదేవి మండల టీడీపీ అధ్యక్షుడు నడకుదుటి జనార్దన్రావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావిరత్నగిరి, జిల్లా ఉపాధ్యక్షుడు లకనం నాగాంజనేయులు, కొత్తపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు చందన రంగారావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు విస్సంశెట్టి రాజా, కొల్లి మురళి, మాతంగి జనార్దన్రావు తదితరులు ఉన్నారు.
