MDK | దొడ్డి కొముర‌య్య‌కు మంత్రి దామోద‌ర్ నివాళి

మెద‌క్ : తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయ‌న‌ విగ్రహానికి రాష్ట్ర‌ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కురుమ, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply