సంగారెడ్డి (ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో), ఆంధ్ర‌ప్ర‌భ : పేద‌ల సంక్షేమానికే ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarasimha) అన్నారు. ఈ రోజు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్ కార్డులు పంపిణీ, షాదీ ముబారక్, క‌ల్యాణ‌ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఇప్పటివరకు జిల్లాలో 39,000 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ (Distribution of new ration cards) చేసినట్లు తెలిపారు. పేదలకు ఇందిరమ్మ గృహ కేటాయింపులు కూడా త్వరలో వేగవంతం చేస్తామని తెలిపారు. అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ (Automatic signal system) ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి ,టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి,లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంగారెడ్డి మండలానికి సంబంధించి 15 మంది లబ్ధిదారులకు, సదాశివపేట మండలానికి 75 మంది లబ్ధిదారులకు కొండాపూర్ (Kondapur) లో 17 మంది లబ్ధిదారులకు, కంది మండలానికి సంబంధించి ఆరుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి అంద‌జేశారు. షాదీ ముబారక్ పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 123 మంది లబ్ధిదారులకు రూ .1 కోటి 23 లక్షల 14 వేల 27 7 రూపాయలు చెక్కులను ల‌బ్ధిదారులకు మంత్రి అందజేశారు. సంగారెడ్డి (Sangareddy) మండలంలో 46 మంది లబ్ధిదారులకు, సదాశివపేట మండలంలో 64 మంది లబ్ధిదారులకు కొండాపూర్ లో తొమ్మిది మందికి కంది మండలంలో నలుగురికి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో రేషన్ కార్డుల కోసం 68 వేల దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చినట్లు వీటిలో 39 వేల మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 6000 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు. రేషన్ కార్డులో పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.

Leave a Reply