ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి

ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి

కూసుమంచి, ఆంధ్రప్రభ: కూసుమంచి మండల కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకులు ఎండి హైమదల్లీ, రంజాన్ అలీ సోదరులు ముస్లింలకు ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు 40 రోజులపాటు ఉపవాస దీక్షలో ఉంటారు. వారు సాయంత్రం ఉపవాసం విడుస్తారు. ఇందులో భాగంగా హైమదల్లీ, రంజాన్ అలీ సోదరులు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఆహారం వడ్డించారు. రంజాన్ మాసంలోని పవిత్ర ఉపవాసంలో ఉన్న ముస్లిం సోదరులు 40 రోజులపాటు అల్లా దయవల్ల ఉపవాస దీక్షను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply