Minister | శ్రీకృష్ణ ఆలయాన్ని కాపాడతాం

Minister | శ్రీకృష్ణ ఆలయాన్ని కాపాడతాం
- సీఎం దృష్టికి తీసుకెళ్తాం : వై. నాగేశ్వరరావు యాదవ్
Minister | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల చెక్‌పోస్ట్‌లోని శ్రీకృష్ణ భగవానుడి దేవస్థానం పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్ధమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో నిర్వహించనున్న “శ్రీ సుదర్శన హోమం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ యాదవ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు.
ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో ఉదయం 10 గంటలకు హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ, నంద్యాల చెక్‌పోస్ట్‌లో గల శ్రీకృష్ణ భగవానుడి ఆలయ స్థలంపై మునిసిపల్ అధికారులు సరైన అవగాహన లేకుండా కూల్చివేత చర్యలపై హెచ్చరికలు జారీ చేయడం యాదవ సమాజంలో ఆందోళనకు దారితీసిందన్నారు.

ఆలయ నిర్మాణం అప్పటి కలెక్టర్, ఆర్డీఓ, డీఆర్ఓ, ఎమ్మార్వో అనుమతులతోనే జరిగిందని, సంబంధిత పత్రాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాస్, ఎంపీ, మంత్రి టీజీ భరత్, ఎంపీ శబరి, ఎమ్మెల్యే చరితా రెడ్డి తదితరుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఆలయ పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో డాక్టర్ బాలమద్దయ్య యాదవ్, తిమ్మయ్య యాదవ్, అయ్యన్న యాదవ్, శేషిపాణి యాదవ్, శ్రీరాములు యాదవ్, నాగరాజు యాదవ్, డాక్టర్ ఈశ్వరయ్య యాదవ్, డాక్టర్ చంద్రయ్య యాదవ్, సింధు నాగేశ్వరరావు యాదవ్, రాము యాదవ్, చంద్ర యాదవ్, నారాయణ యాదవ్, ప్రభాకర్ యాదవ్, వరుణ్ యాదవ్, మల్లికార్జున యాదవ్, తిక్కన్న యాదవ్, బీజేపీ నాగరాజు యాదవ్, రాజు యాదవ్, పుల్లయ్య స్వామి, యాదవ కమిటీ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, హిందూ బాంధవులు బీసీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ ఆలయం జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని, భక్తుల భావోద్వేగాలను గౌరవించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
