Mineral water plant | ప్రయాణికుల సౌకర్యార్ధం..
- ఆర్టీసీ బస్టాండ్‌లో మినరల్ వాటర్ ప్లాంట్
- ఎంపీ నిధులు రూ.9 లక్షలతో నిర్మించిన ఉచితంగా ఏర్పాటు
- జిల్లా కలెక్టర్, నంద్యాల ఎంపీ
Mineral water plant | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పార్లమెంట్ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా. బైరెడ్డి శబరితో కలిసి ఈ రోజు ప్రారంభించారు. రూ.9 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు, కార్మికులకు శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నంద్యాల జిల్లా బస్ కాంప్లెక్స్‌లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో పెయింటింగ్, డ్రైనేజీ మరమ్మత్తులు, టాయిలెట్ల పునరుద్ధరణ, సరైన పార్కింగ్ సదుపాయాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాంప్లెక్స్‌లోని దుకాణదారులు ఎంఆర్పీ ధరకే వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, పారిశుధ్య కార్మికులు తమ సమస్యలపై ఎంపీ కి వినతి పత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, ఆర్టీసీ డిపిటీసి రజియా సుల్తానా, ఆర్టీసీ డిపో మేనేజర్ జె.వి. మాధవిలత, ఆర్‌డబ్ల్యూఎస్ డీఆర్ఈఓ ఈ. శ్రీనివాసులు, డీఈఈ శివమోహన్, ట్రాఫిక్ సీఐ చాన్ బాషా, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, మినరల్ వాటర్ ప్లాంట్ కాంట్రాక్టర్ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


