Nigeria: కుప్పకులిన విమానం.. 32 మంది మృతి
Nigeria: నైజీరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 32 మంది మరణించారు. నైజీరియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ATR-42 మిలిటరీ విమానం నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న ఒండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా అనే ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానంలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు క్రూ సిబ్బంది (మొత్తం 32 మంది) ఉన్నారు. వీరంతా ప్రమాదంలో మరణించినట్లు నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ధృవీకరించారు. బాధితుల్లో ఎక్కువ మంది సైనిక సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
ఈ విమానం బెనిన్ సిటీ నుండి నైజీరియా ఆర్థిక రాజధాని లాగోస్‌కు సాధారణ మిషన్‌లో భాగంగా వెళ్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయి కుప్పకూలింది. ఒక నావల్ బేస్ (నౌకాదళ కేంద్రం) సమీపంలోని చిత్తడి నేలల్లో (Swampy terrain) ఈ విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.
నైజీరియన్ ఎయిర్ ఫోర్స్, పోలీస్, రెడ్ క్రాస్, ఇతర రక్షణ సంస్థలు ఘటనా స్థలానికి చేరుకుని శోధన చర్యలు చేపట్టాయి.
ఈ ఘోర ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
