వాంఖడే : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానం కోసం అగ్రశ్రేణి పోటీదారులు తలపడనున్నారు. శుభమాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ తో.. వాంఖడే వేదికగా ముంబై జట్టు అమీతుమీ తలపడనుంది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జీటీ కెప్టెన్ శుభమన్ గిల్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టనుంది.
జట్టు మార్పులు:
ముంబై ఇండియన్స్: ఎలాంటి మార్పులు లేవు.
గుజరాత్ టైటాన్స్: వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ఖాన్
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్: శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్స్
గుజరాత్ టైటాన్స్: అనుజ్ రావత్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్, దసున్ షనక.
ముంబై ఇండియన్స్: రాబిన్ మింజ్, రాజ్ అంగద్ బావా, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, అశ్వనీ కుమార్.
సమవుజ్జీల సమరం !
అయితే, సీజన్ ప్రారంభంలో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో అదరగొడుతుండగా, ముంబై ఇండియన్స్ మాత్రం విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. ముంబై జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆర్సీబీ చేతిలో ఓటమి తర్వాత ముంబై జట్టు అదిరే కంబ్యాక్ ఇచ్చింది. సీజన్ సెంకడ్ హాఫ్ లో ముంబై ఇండియన్స్ వరుసగా ఆరు విజయాలతో ఓటమెరుగని ముంబై జట్టుగా దూసుకుపోతుంది. దీంతో ప్రస్తుతం 3వ స్థానంలో నిలిచింది.
మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టు మధ్యలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ.. పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో కొనసాగుతోంది. దీంతో, నేడు వాంఖడేలో ముంబై – గుజరాత్ పోరు హోరాహోరీగా సాగనుంది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు సమానంగా ఉన్నాయి. రెండు జట్లు 14 పాయింట్లతో 3, 4వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది.