Messi | స్టేడియంలో మెస్సి అభిమానుల ఆగ్రహం

Messi | స్టేడియంలో మెస్సి అభిమానుల ఆగ్రహం

Messi | కోల్‌కతా, ఆంధ్ర‌ప్ర‌భ‌ : కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి పర్యటన ఆనందంగా మొదలైనా, సాల్ట్‌లేక్ స్టేడియంలో(saltlake stadium) అభిమానులకు కాస్త ఆగ్రహం తెప్పించింది. మెస్సి త్వరగా వెళ్లిపోవడంతో నిరాశ చెందిన అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు.

ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రీడాకారుడు మెస్సి (Messi) కోల్‌కతా పర్యటనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సాల్ట్‌లేక్‌ స్టేడియంలో సందడి చేశాడు. అతణ్ని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే, స్టేడియం నుంచి మెస్సి త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు విసిరేశారు. మైదానంలోకి దూసుకెళ్లి టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

Leave a Reply