Megastar | విశ్వంభర రిలీజ్ డేట్‌ ఇదే..

Megastar | విశ్వంభర రిలీజ్ డేట్‌ ఇదే..

Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు విశ్వంభర పై పడింది. అసలు విశ్వంభర మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. సమ్మర్ లో విశ్వంభర రిలీజ్ అని గతంలో ప్రకటించారు. దీంతో ఓ డేట్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ డేట్ కాదు అంటూ బాహుబలి డేట్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. విశ్వంభర వచ్చేది ఎప్పుడు..? బాహుబలి డేట్ విశ్వంభరకు కలిసొచ్చేనా..?

Megastar

Megastar | ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అనగానే..

చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ విశ్వంభర మూవీని (Movie) తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు క్వాలిటీ సరిగా లేదని విమర్శలు వచ్చాయి. దీంతో లేట్ అయినా ఫరవాలేదు.. లేటెస్ట్ గా.. మంచి క్వాలిటీతో ఉండాలని వీఎఫ్ఎక్స్ వర్క్ పై మరింత ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అనగానే.. మే 9న విశ్వంభర రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. ఈ డేట్ ప్రచారంలోకి రావడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అది ఏంటంటే.. జగదేకవీరుడు అతిలోక సుందరి మే 9న రిలీజైంది. ఆ సినిమా వలే విశ్వంభర కూడా సోషియో ఫాంటసీ మూవీ కావడంతో.. అదే డేట్ కి మే 9న రిలీజ్ చేయాలి అనుకున్నారని టాక్ వినిపించింది.

Megastar

Megastar | ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్

ఇప్పుడు మే 9న కాదు.. బాహుబలి రిలీజైన జులై 10న రిలీజ్ కానుందని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇటీవల వీఎఫ్ఎక్స్ వర్క చూసి.. క్వాలిటీ బాగుండడంతో జులై 10న రిలీజ్ (Release) చేయాలని డేట్ లాక్ చేసారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇందులో చిరుకు జంటగా త్రిష నటించగా, ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగతం అందించారు. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్, సురభి పురాణిక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరిలో మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఓ ఆరు నెలలు గ్యాప్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో చిరు ఈ డేట్ లాక్ చేసారని టాక్. జులై 10న వచ్చిన బాహుబలి ప్రభాస్ కు బాగా కలిసొచ్చింది. మరి.. బాహుబలి డేట్ లో రావాలి అనుకుంటున్న మెగాస్టార్ కు కూడా ఆ డేట్ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ అందిస్తుందేమో చూడాలి.

CLICK HERE TO READ డెకాయిట్‌తో సక్సెస్ సాధించేనా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply