కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలిసిన ఎమ్మెల్యే

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలిసిన ఎమ్మెల్యే

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని, కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కలిశారు. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసి స్థల పరిశీలన వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు.


నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి గురించి, నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగాపూర్ నుండి టేక్రియాల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రికి విన్నవించినట్టు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించినట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు తెలిపారు.

Leave a Reply