ఉగాది పర్వదినం సందర్భంగా..

ఉగాది పర్వదినం సందర్భంగా..

  • తాడేపల్లి నివాసంలో మర్యాదపూర్వక భేటీ
  • ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వైసిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ Reddy ను ఆయన తాడేపల్లి నివాసంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సంక్షిప్తంగా చర్చించినట్లు సమాచారం.

ఈ భేటీలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ , ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు రావు , జోగి రమేష్ పాల్గొన్నారు.
పండుగ సందర్భంగా జరిగిన ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు

Leave a Reply