Meenakshi Chaudhary | ఆ సంస్థలో నాలుగో సినిమా..?

Meenakshi Chaudhary | ఆ సంస్థలో నాలుగో సినిమా..?

Meenakshi Chaudhary | ఆ సంస్థలో నాలుగో సినిమా..?

Meenakshi Chaudhary | మొదటి రెండు సినిమాలు ఆడకపోయినా వచ్చిన బ్రేక్
హిట్ 2 నుంచి సెన్సేషన్ బ్యూటీగా ఎదుగుదల
స్టార్ హీరోలతో వరుస అవకాశాలు
సితార సంస్థకు లక్కీ హీరోయిన్‌గా మీనాక్షి
భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ – నాని లేదా కార్తి సినిమా?
నాలుగోసారి కూడా బ్లాక్ బస్టరేనా?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ అందుకుంటుంది. అయితే.. ఈ బ్యూటీ ఓ నిర్మాణ సంస్థకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఆ సంస్థలో సినిమా చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టరే అనేది సెంటిమెంట్ గా మారింది. అయితే.. ఈ అందాల బొమ్మ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ కోసం ఆ నిర్మాణ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ నిర్మాణ సంస్థ ఏంటి..? మీనాక్షి ఏ సినిమా చేయబోతుంది..?

Meenakshi Chaudhary | రెండు సినిమాలు ఆడకపోయినా..

Meenakshi Chaudhary

ఇచట వాహనములు నిలుపరాదు అనేసినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆతర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఆ సినిమా కూడా ఆడలేదు. అయితే.. అడవి శేష్ కు జంటగా హిట్ 2 సినిమాలో నటించింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో.. మీనాక్షికి మంచి గుర్తింపు తెచ్చింది. ఇక అక్కడ నుంచి మీనాక్షి సక్సెస్ కంటిన్యూ అవుతోంది.

Meenakshi Chaudhary | సెన్సేషనల్ బ్యూటీ..

Meenakshi Chaudhary

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ సెన్సేషన్ గా మారిపోయింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో గుంటూరు కారంలో నటించింది. కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి జన నాయగన్ మూవీలో నటించింది. వెంకటేష్‌ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళ్ లో కూడా నటిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది. ఓ బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పిందని సమాచారం.

Meenakshi Chaudhary | సితార సంస్థకు లక్కీ హీరోయిన్..

Meenakshi Chaudhary

అసలు విషయానికి వస్తే.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ మూవీలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సంస్థ నుంచే వచ్చిన గుంటూరు కారం, అనగనగా ఒక రాజు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇలా సితార సంస్థలో మీనాక్షి నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సంస్థకు లక్కీ హీరోయిన్ గా మారింది మీనాక్షి. ఇప్పుడు ఆ సంస్థలో మీనాక్షి నాలుగో సినిమా చేయబోతున్నట్టుగా టాక్. ఈ నిర్మాణ సంస్థ నానితో ఓ సినిమా చేస్తుంది. అలాగే కార్తితో ఓ సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాకి మీనాక్షిని తీసుకోనున్నారని.. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇదే కనుక నిజమైతే.. సితార సంస్థలో చేసే నాలుగో సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో చూడాలి.

Leave a Reply