Medical | 576 మందికి ఉచిత వైద్యసేవలు
- మందులు పంపిణీ చేస్తున్న వలంటీర్లు
Khammam | వైరా, ఆంధ్రప్రభ : వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనం (సీపీఎం కార్యాలయం)లోని ప్రతి నెలా మూడో ఆదివారం బోడేపూడి కళానిలయం నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరంలో 576 మందికి వైద్యసేవలు(Medical services for 576 people) అందించారు. ఈ రోజు 125వ నెల మెడికల్ క్యాంపును నిర్వహించారు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షించి నెల రోజులకు సరిపడా మందులను కేవలం100 రూపాయలకే అందించారు.
ఈ సందర్భంగా బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు(Bonthu Rambabu) మాట్లాడుతూ.. ఆహార అలవాట్లు, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. శరీర బరువును నియంత్రించుకోవాలని, చక్కెర, స్వీట్లు ,కూల్డ్రింక్స్ మొదలైన వాటిని పూర్తిగా మానేయాలని, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు ఎక్కువగా తినాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బోడేపూడి వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, వాలంటీర్లు చింతనిప్పు చలపతిరావు(Chintanippu Chalapathy Rao), బొంతు సమత, గుడిమెట్ల మోహనరావు, అనుమోలు రామారావు, మాదినేని రజిని, మోదుగు నాగరాణి, మల్లెంపాటి ప్రసాదరావు, హరి వేంకటేశ్వరరావు, కంభంపాటి సత్యనారాయణ, మందడపు నాగేశ్వరావు, పూనాటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

