Medical | శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

Medical | శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

Medical | ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ సరంచ్ ముప్పనేని రవి ప్రసాద్ మరియు గ్రామ ప్రజల సహకారంతో సెంటిని హాస్పిటల్స్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు బి.పి, షుగర్, అవసరమైన వారికి ఈసీజీ, 2D- ఏకో పరీక్షలు ఉచితముగా నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా.కాగిత కృష్ణచంద్ రోగులకు పరీక్షలు చేశారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 80 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

Leave a Reply