medaram l సమ్మక్క పుట్టిల్లో తిరుగువారం పండుగ..

medaram l సమ్మక్క పుట్టిల్లో తిరుగువారం పండుగ..

తాడ్వాయి, ఆంధ్రప్రభ; సమ్మక్క పుట్టిల్లు బయ్యాక్కపేటలో చందా వంశీయుంలు తిరుగువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనదేవతల సన్నిధిలో భక్త జనసందోహంతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వన దేవతలకు బంగారం, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుగువారం సందర్భంగా ఆడబిడ్డలు అలుకు పూతలు చేసి రంగు రంగుల ముగ్గులు వేశారు. సమ్మక్క పూజారులు( తలపతులు) శుద్ధి కార్యక్రమం నిర్వహించి సమ్మక్కకు దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల పూజ సామాగ్రి,పట్టు వస్త్రాలను పూజారులు భద్రపరుచారు. ఈ యాటను నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమం లో తలపతులు చందా పరామయ్య, చందా రఘుపతి రావు,చందా కళ్యాణ్, వెంకన్న, చందా గోపాల్ రావు చందా వంశీయులు పాల్గొన్నారు.

Leave a Reply