మొక్కలు నాటిన నాయకులు..

మొక్కలు నాటిన నాయకులు..

ఆంధ్రప్రభ, జగదేవపూర్: భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం నేల మీద ప్రతి ప్రాణిని ప్రేమిస్తూ మొక్కలను ఆరాధించాలని ధర్మం చెబుతుంది ఆ ధర్మాన్ని అనుసరిస్తూ దేవాలయాల వద్ద మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో భాగంగానే మండల కేంద్రమైన జగదేవపూర్ లో గల శ్రీ రంగనాయకుల స్వామి దేవాలయం వద్ద ఆదివారం నాడు గ్రామ సర్పంచ్ అనుగట్ల శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ బంగ్లా శ్రీనివాస్ రెడ్డి భక్తులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఏకబిల్వం, త్రిదళం, పారిజాతం కొబ్బెర దేవ గన్నేరు లాంటి అనేక రకాల మొక్కలను నాటడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవంతుడి సన్నిధిలో మంచి మొక్కలు ఏర్పాటు చేయడం భక్తులకు ఎంతో శుభప్రదం అన్నారు మంచి మొక్కలు నాటడం వల్ల అక్కడ దేవుడు అనుగ్రహంతో పాటు పూజకు కావలసిన పత్రాలు అందుబాటులో ఉంటాయన్నారు దేవుడి సన్నిధిలో పచ్చదనంతో పాటు భక్తులు సేద తీర్చుకునేందుకు వృక్షాలు అవసరమని తెలిపారు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం భక్తులకు ఎంతో శుభప్రదం అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply