బీఆర్‌ఏఓయూలో ఎంసీఏ ప్రవేశ పరీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎంసీఏ (మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును అక్టోబర్‌ 10 వరకు పొడిగించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎంసీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని తెలిపారు. డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు.

అర్హత ఉన్న విద్యార్థులు braouonline.in వెబ్‌సైట్‌ ద్వారా ఎంసీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశ పరీక్ష, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 040-23680222, 040-23680333, 040-23680555 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.