కొత్త సారొచ్చారు..

కొత్త సారొచ్చారు..

ఆర్‌డ‌బ్ల్యూఎస్ తుగ్గ‌లి ఇంజనీర్‌గా మాయన్క్

తుగ్గలి నవంబర్1(ఆంధ్రప్రభ) : తుగ్గలి మండలం ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఇంజనీర్‌గా మాయన్క్‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. తుగ్గలి మండల ఆర్‌డ‌బ్ల్యూఎస్ఇంజనీర్ గా ఉన్న నరేష్ రోడ్డుకు బిల్లు చెల్లించేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు దొరికి పోవ‌డంతో ప్ర‌భుత్వం ఏఈ న‌రేష్‌ను సస్పెండ్ చేసింది. దీంతో మద్దికేర మండలం ఏఈ మాయన్క్ ను తుగ్గలికి ఇన్చార్జి ఏఈగా నియమించారు.

ఈ సందర్భంగా శనివారం ఏఈ మాయన్క్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో ఎక్కడ నీటి సమస్య ఉన్న తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే తమకు తెలియకుండా ఎక్కడైనా మంచినీటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల ప్రజలు, అందరూ సహకరించాలని కోరారు.

Leave a Reply