టీడీపీలో భారీగా చేరికలు
పాయకాపురం, ఆంధ్రప్రభ: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో నడుస్తున్నదని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయకాపురంలోని ఎంఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం వ్యాపారవేత్త సాయి సంజయ్ ఆధ్వర్యంలోపలువురు టీడీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థతో కలసి పలువురికి పార్టీ కండువాలు మెడలో వేసి ఆహ్వానం పలికారు.
పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు,ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి ఘంటా కృష్ణ మోహన్,సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడితలసి శ్రీను,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సోమన అనీల్,కంచేటి నాగరాజు,లబ్బా వైకుంఠం, కోలా శ్రీను,టీడీ దుర్గారావు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
