Mass Director | బోయపాటి.. నెక్ట్స్ ఏంటి..?

Mass Director | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఊర మాస్ డైరెక్టర్ అనగానే.. ఠక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. మాస్ జనాలు మెచ్చేలా సినిమాను ఎలా తీయాలో.. ఈ జనరేషన్ డైరెక్టర్స్(Generation Directors) లో బోయపాటికి బాగా తెలుసు. అందులోనూ.. బాలయ్యను ఎలా చూపించాలో.. ఎలా చూపిస్తే.. జనాలకు బాగా నచ్చుతుందో అలా ప్రెజెంట్ చేస్తుంటారు. అందుకనే.. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు జనాలకు అంతలా నచ్చేస్తుంటాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్(Create records) చేస్తుంటాయి. అయితే.. బోయపాటి తాజాగా తెరకెక్కించిన అఖండ 2 థియేటర్స్ లోకి వచ్చింది.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది కానీ.. ఆశించిన స్థాయిలో అఖండ 2(Akhand 2) ఆకట్టుకోలేకపోయింది అనే మాట బలంగా వినిపిస్తోంది. మరి.. బోయపాటి.. నెక్ట్స్ ఏంటి..?

Mass Director | బాలయ్య నయా రికార్డ్..

Mass Director

బాలయ్య, బోయపాటి.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ.. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి బ్లాక్ బష్టర్ సక్సెస్ సాధించాయి. దీంతో అఖండ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన అఖండ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. డిసెంబర్ 5న రావాల్సిన అఖండ 2 ఊహించని విధంగా పోస్ట్ పోన్(Post Pon) అవ్వడం.. డిసెంబర్ 12న రిలీజ్ కావడం తెలిసిందే. ఈ సినిమా బాలయ్య అభిమానులను బాగా ఆకట్టుకుంది కానీ.. సామాన్య జనాలకు.. సినీ విమర్శకులకు అంతగా నచ్చలేదనే టాక్ వచ్చింది కానీ.. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్(First Day Collections) మాత్రం 59.5 కోట్లు వచ్చింది. ఇది బాలయ్య కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఓపెనింగ్ వీకెండ్ 83 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

Mass Director | బోయపాటి ట్రాక్ తప్పాడా..

Mass Director

బోయపాటి.. రవితేజతో భద్ర, వెంకటేష్‌ తో తులసి, అల్లు అర్జున్ తో సరైనోడు.. సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. అయితే.. ఎన్టీఆర్ తో దమ్ము, రామ్ చరణ్‌ తో వినయ విధేయ రామ, రామ్ తో స్కంధ చిత్రాలు(Skanda images) చేశారు కానీ.. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఇప్పుడు బాలయ్యతో తీసిన అఖండ 2 ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అనేది వాస్తవం. కలెక్షన్స్ చూసుకున్నా.. డిస్ట్రిబ్యూటర్స్(Distributors) కు కొంత మేర నష్టాలు రావచ్చు అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పటికే కలెక్షన్స్ చాలా ఏరియాల్లో బాగా తగ్గిపోయాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్కంధ ప్లాప్ అయ్యింది.. అఖండ 2 కూడా అదే దారిలో వెళుతుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో బోయపాటి ట్రాక్(Boyapati track) తప్పాడు అనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Mass Director | నెక్ట్స్ ప్లాన్..

Mass Director

బోయపాటి తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రభాస్, మహేష్‌ బాబు, రామ్ చరణ్‌, ఎన్టీఆర్.. ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు, విశ్వంభర రిలీజ్(vishwambhara release) కి రెడీ అవుతున్నాయి. బాబీ, శ్రీకాంత్ ఓదెల.. ఈ ఇద్దరి దర్శకులతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు. అందుచేత చిరుతో సినిమా చేయాలన్నా వెయిట్ చేయాల్సిందే. నాని, విజయ దేవరకొండ(Vijaya Devarakonda)లతో బోయపాటి చేయచ్చు.

అయితే.. విజయ్ దేవరకొండ.. కోలా రవికిరణ్‌ తో సినిమా, రాహుల్ సాంకృత్యన్ తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇప్పుడు మూడవ సినిమాకి కూడా ఓకే చెప్పినట్టుగా టాక్ వినిపిస్తుంది. నాని కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. బన్నీతో బోయపాటి సరైనోడు(Boyapati sarainodu) తర్వాత మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఇప్పుడు అట్లీతో చేస్తున్న మూవీని మే నెలకి కంప్లీట్ చేస్తాడు. నెక్ట్స్ ఏంటి అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. అయినప్పటికీ బోయపాటితో ఇప్పట్లో బన్నీ సినిమా ఉండకపోవచ్చు అనేది ఇండస్ట్రీ టాక్. తెలుగులో ఏ హీరో ఖాళీగా లేకపోవడంతో తమిళ హీరో సూర్యతో బోయపాటి సినిమా ఉండచ్చు అని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి.. బోయపాటి నెక్ట్స్(Boyapati Next) మూవీని ఎవరితో చేస్తారో..?

Mass Director

CLICK HERE TO READ సరికొత్త రికార్డ్ సెట్ చేసిన దేఖ్ లేంగే సాలా..

CLICK HERE TO READ MORE

Leave a Reply