వైభవంగా మార్కండేయ స్వామి హోమ–యజ్ఞం

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లిలోని పద్మశాలి భవనంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మహా హోమ-యజ్ఞం, పూర్ణహోతి, ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు.

భీమండి చెందిన పురోహితులు జంజిరాల నంబయ్య, ఆలయ అర్చకులు సాంబారి కిషన్ ఆధ్వర్యంలో గణపతి, గౌరీ పూజ, స్వస్తి వాచనం, నిత్య ఆరాధన, పుణ్యాహవచనం, మహా హారతి, మంత్రపుష్పం, మహా దాశీర్వచనం వంటి పూజావిధులు పూర్తయ్యాయి. అనంతరం భక్తులకు మహా ప్రసాద వితరణ చేపట్టారు.

కలమడుగు చెందిన జొన్నల శంకరయ్య బృందం భగవద్గీత పారాయణం నిర్వహించగా, వందలాది మంది భక్తులు మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన వితరణ నిర్వహించారు.

కార్యక్రమంలో దండేపల్లి పట్టణ అధ్యక్షుడు నోడ్బాల శంకర్, మండల అధ్యక్షుడు వంగ శంకరయ్య, మండల–పట్టణ పద్మశాలి సంఘ నాయకులు, కమిటీ సభ్యులు, కులబంధువులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply